చర్ల మండల మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాయతీ అధికారి తోకల సురేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో సమరయోధుల ప్రాణ త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.