యువతి అదృశ్యం
కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పాతచర్లకు చెందిన ఓ యువతి మంగళవారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికిన దొరకకపోవడంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజువర్మ తెలిపారు.