దొడ్డి కొమురయ్య పోరాట చరిత్రను భావితరాలకు అందిస్తాం
దొడ్డి కొమురయ్య పోరాట చరిత్రపై గార్ల మండలంలో కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో మండల కమిటీ కార్యదర్శి గిన్నారపు మురళి తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సాయుధ పోరాట వీరుల చరిత్రను నేటితరం, భవిష్యత్ తరం అధ్యయనం చేయాలని, వారి ఆశయాల కోసం నిరంతరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.