సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో తెలంగాణా ప్రభుత్వం ద్వారా మత్స్య శాఖ ఆధ్వర్యంలో 6. 3 లక్షల రూపాయల విలువైన 3. 75 లక్షల ఉచిత చేపపిల్లలను మత్స్యకారులకు అందజేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వారితో కలిసి చేపపిల్లలను శుక్రవారం చెరువులో వదిలారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం, వారిని ఆర్ధికంగా అభివృద్ధి పరచాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లను పంపిణీ చేసింది అని అన్నారు.