భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం గ్రామంలో బుధవారం చేయూత పెన్షన్ ఇప్పటికీ అందలేదని గత నెల పెన్షన్ ఇప్పటికీ ఎకౌంట్లో జమ కాలేదని వృద్ధులు వాపోయారు. పూర్తిగా పెన్షన్ మీద ఆధారపడ్డ మాకు ఇప్పటికీ పెన్షన్ అందకపోవడంతో నిత్యవసర సరుకులకు ఇబ్బంది ఏర్పడిందని దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నామని వృద్ధులంతా వాపోయారు.