సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎంపీ

79చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎంపీ
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అనారోగ్యానికి గురైన 20 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. ఖమ్మం నగరం, పరిసర ప్రాంతాలకు చెందిన 20 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 5లక్షల 85వేల రూపాయలు మంజూరు చేయించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను గురువారం సాయంత్రం ఖమ్మం బురహాన్ పురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీ వద్దిరాజు అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్