కిన్నెరసాని ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తివేత

73చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు దంచి కొడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్టు సామర్థ్యం 407 అడుగులు కాగా, బుధవారం మధ్యాహ్నం 404. 60 అడుగులకు నీటిమట్టం చేరటంతో ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి 53, 000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్