కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం భారీ వర్షాల వల్ల ముంపుకు గురైన బాధితులకు నిత్యవసర సరుకులను జిల్లా జడ్జి వసంత పటేల్ పంపిణీ చేశారు. పాల్వంచ మండలం యానం బైలు, ఉల్వనూరు గ్రామ వరద బాధితులకు నిత్యవసర సరుకులను అందజేశారు. ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.