భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

57చూసినవారు
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
సెల్ఫీల కోసం వాగులు, వంకలు, నదులు వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావొద్దని కొత్తగూడెం ఎస్పీ బుధవారం కోరారు. వరద నీటితో నిండిపోయిన రోడ్లను దాటడానికి ప్రయత్నించవద్దని, వర్షాల కారణంగా రోడ్లు బురదమయంగా మారే అవకాశం ఉన్నందున వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాలన్నారు. ప్రజల రక్షణ కొరకు తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు వారు విధించిన ఆంక్షలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్