ఆళ్లపల్లి మండలం అడవిరామారానికి చెందిన నిషేధిత మావోయిస్టు పార్టీకి పనిచేస్తున్న ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ దళ సభ్యుడు మడకం ఇడుమ్య పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయినట్లు ఎస్పీ బి. రోహిత్ రాజు తెలిపారు. మడకం ఇడుమయ్య 15 ఏళ్ల క్రితం కరిగుండెం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఆళ్లపల్లి మండలం అడవిరామారం గ్రామానికి వలస వచ్చినట్లు తెలిపారు.