78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అహలే సున్నత్వల్ జామాత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు జెబి. శౌరి పతాక ఆవిష్కరణ చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వీరులు, దేశ రక్షణ కోసం అసువులు బాసిన అమర వీర జవాన్ లకు నివాళులర్పించారు.