అశ్వాపురం తుమ్మల చెరువులో ఏర్పాటుచేసిన బోటింగ్ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. తుమ్మల చెరువు సుమారు 1500 ఎకరాల విస్తీర్ణం కలిగి, కాకతీయుల కాలంలో నిర్మించబడిందని అన్నారు. ఈ చెరువు వల్ల వేలాది ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందుతుందన్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ఎంతో అభినందనీయమని, చొరవ చూపిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు చెప్పారు.