భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సాకేతపురి ఆంజనేయస్వామి ఆలయంలో తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హిందూ ఐక్యవేదిక కార్యకర్తలు మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం విషయంపై తక్షణమే సిబిఐ ఎంక్వయిరీ జరిపించాలన్నారు.