ప్రభుత్వ ప్రతి పథకం నిరుపేదలకు అందేలా కృషి చేస్తానని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. అశ్వాపురం మండలంలోని వరద ప్రభావిత గొందిగూడెం, తుమ్మ లచెరువు, వెంక టాపురం గ్రామ పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన గురువారం పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత, మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఏడీఏ తాతారావు తదితరులు పాల్గొన్నారు