మణుగూరు మండలం విప్పలసింగారం గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వేను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించి వివరాలు తెలియజేయాలని ఎమ్మెల్యే సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.