భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రేషన్ కార్డులు లేకపోవడం వల్ల ఎందరో నిరుపేదలు సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి నూతన రేషన్ కార్డుల ఆన్లైన్ ప్రక్రియను చేపట్టాలని మణుగూరు సామాజిక కార్యకర్త కర్నె రవి ప్రభుత్వాన్ని కోరారు. మేరకు మంగళవారం మణుగూరు మండల తాసిల్దార్ ను కలిసి, మణుగూరు మండల వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులను విడుదల చేయాలని వినతి పత్రం అందజేశారు.