భాస్కర్ నగర్ డబల్ బెడ్రూం కాలనీవాసుల బాధలు

559చూసినవారు
బూర్గంపాడు మండలం సారపాక పరిధిలో గల భాస్కర్ నగర్ డబుల్ బెడ్రూం ఇళ్లకు రోడ్డు సదుపాయం లేదని, కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదని కాలనీవాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుధవారం వారి బాధలు చెప్పుకొని ఆవేదన చెందారు. పక్కనే చెత్త డంపింగ్ యార్డ్ కట్టారని, దుర్వాసనతో పక్కనే శవాల భయంతో నివసిస్తున్నామని వాపోయారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బూర్గంపాడు మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్