తండాల మధ్య పొంగుతున్న వాగు

76చూసినవారు
తండాల మధ్య పొంగుతున్న వాగు
టేకులపల్లి మండలంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండల పరిధిలోని కొండేగుల బోడు, మద్రాస్ తండాల మధ్య ఉన్న వాగు ప్రధాన రహదారి పైనుండి వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో రెవెన్యూ శాఖ అధికారులు ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. వాగు దాటే ప్రయత్నం ఎవరూ చేయరాదని హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డుకు ఇరువైపుల భారీ కేడ్లు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్