సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య, బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. సోమవారం జేకే ఓసి వద్ద వారు మాట్లాడుతూ కార్మికులకు రావలసిన ఏరియర్స్, లాభాల్లో వాటా ఓకేసారి ఇవ్వాలని, వెంటనే తేదీ ప్రకటించాలని, లేనియెడల అవసరమైతే సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.