భారతదేశ తొలి ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిను గార్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కార్యనిర్వాహక అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఘన నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుండా వెంకట్ రెడ్డి, గిన్నారపు మురళి, తారక రామారావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.