ఇల్లందు పట్టణంలోని చెరువు కట్ట ఏరియాకు చెందిన బండి కమల్ కుమార్(32) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కలహాల నేపధ్యంలో బండి కమల్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేశాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.