ప్రపంచ క్షౌరవృత్తి దారుల దినోత్సవాన్ని శనివారం నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జగదాంబ సెంటర్ తల్లి తెలంగాణా విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి కొత్త బస్టాండ్ మీదుగా గోవింద్ సెంటర్ నుండి తెలంగాణా ప్రభుత్వం నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘ భవనానికి కేటాయించిన (గల్ల్స్ హై స్కూల్ వెనుక) స్థలం వద్దకు చేరుకొని నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు ముత్యాల లక్ష్మణ్ జెండాను ఆవిష్కరించారు.