ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల పరిధిలో మంగళవారం చంద్రగిరి గ్రామ చౌరస్తా సెంటర్‌లో గత రాత్రి జరిగిన క్షుద్ర పూజల ఘటనను జీవివి మాచర్ల సుందర్ కుమార్ తీవ్రంగా ఖండించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి జరిగినా నేటి యుగంలో క్షుద్ర పూజలు, చేతబడి, బాణామతి వంటి వాటికి చోటు లేదని ఆయన తెలిపారు. ఇటువంటి వాటిని ఎవరు నమ్మవద్దు. కష్టపడకుండా మనకు ఏదీ రాదు. అనవసర భయాందోళనకు గురి కావద్దని ఆయన తెలిపారు.