ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 8 బస్సు షెల్టర్ల పనులను మంగళవారం మున్సిపల్ చైర్మన్ ధమ్మాలపాటి వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 8 బస్ షెల్టర్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రవి తదితరులు పాల్గొన్నారు.