ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఇల్లందు బస్ డిపో ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఇల్లందు మండల కమిటీ అధ్యక్షుడు ఇస్లావత్ కోటేష్ నాయకులు అధ్యక్షత వహించగా మాస్ లైన్ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి నాయిని రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.