అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టివేత

597చూసినవారు
అక్రమంగా నిల్వ ఉంచిన కలప పట్టివేత
ఇళ్లందు పట్టణంలోని సత్యనారాయణ పురంలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను సోమవారం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇల్లందు ఎఫ్డిఓ వెంకన్నకు సత్యనారాయణపురంలోని ఓ ఇంట్లో అక్రమ కలప ఉన్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు దాడులు చేసి 80 ఫీట్ల టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఎఫ్డిఓ వెంకన్న మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా కలప తరలించిన, నిల్వ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్