ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ సూచనల మేరకు శుక్రవారం ఇల్లందు పట్టణ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో 6గురు సభ్యులతో దళిత బంధు కమిటీని ఎంపిక చేశారు. దళిత బంధు కమిటీ అధ్యక్షుడు మేకల శ్యామ్, కౌన్సిలర్ సంద బిందు ప్రవీణ్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో 24వార్డులలో ఆరుగురు సభ్యులతో దళిత కమిటీ సభ్యులు నియమించాలని ఎమ్మెల్యే ఆదేశాలు, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు నియమించినట్లు తెలిపారు.