సికింద్రాబాద్ BRS ఎమ్మెల్యే పద్మారావును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఇటీవల గుండెపోటు రావడంతో పద్మారావుకు వైద్యులు స్టంట్ వేశారు. ఈ నేపథ్యంలో పద్మారావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కేటీఆర్, కవిత వెంట మాజీ మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.