ఫార్ములా-ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ ఎదుట హాజరయ్యారు. గచ్చిబౌలిలోని KTR నివాసం నుంచి బయలుదేరి.. నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. ఈ నెల 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాల్సి ఉన్నా తాను రాలేనని చెప్పడంతో 16న హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.