కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ఏటీఎం అని గతంలో రాహుల్ గాంధీ అన్నాడని, మరి మూసీ ప్రాజెక్ట్ కాంగ్రెస్ కు రిజర్వు బ్యాంకా అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణకు లక్ష 50 వేల కోట్లు ఖర్చు అవుతుందంటే దేశంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం అని విమర్శించారు. మూసీ ప్రక్షాళన మీద వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది చెప్పాలన్నారు.