హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు ఒకటో తేదీన క్లౌడ్‌బరస్ట్ జరిగింది. దీంతో కులు-మనాలి హైవే పలు ప్రాంతాల్లో దెబ్బతిన్నది. ప్రస్తుతం పునర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాంపూర్‌లో క్లౌడ్‌బరస్ట్ కారణంగా ఆరుగురు మరణించారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో మూడు ప్రాంతాల్లో రూట్లను మూసివేశారు. చండీఘడ్-మనాలీ జాతీయ రహదారిపై రాత్రి రూట్ క్లోజ్ చేశారు. కతౌలా, గోహర్ మీదుగా చిన్న వాహనాలను తరలించారు.