రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి సచివాలయంలో పని చేసే అన్నిశాఖల అధికారులు, సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ విధానంలోనే అటెండెన్స్ నమోదు చేశారు. ఔట్ సోర్సింగ్, సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి ఈ విధానం వర్తింపజేశారు. ఇందుకోసం సచివాలయంలో మొత్తం 60కి పైగా యంత్రాలను ఏర్పాటు చేశారు.