'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్(బుల్లి రాజు). ఈ మూవీలో బుల్లిరాజు పాత్రతో రేవంత్ ఓవర్‌నైట్ స్టారయ్యారు. అతడు ఎక్కడ కనిపించినా అభిమానులు చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. తాజాగా కొందరు అభిమానులు అతడిని ఇబ్బంది పెట్టారు. దీంతో 'వదలండి అంకుల్' అని రేవంత్ రిక్వెస్ట్ చేసినా వారు పట్టించుకోలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.