ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలోకి దూరిన చిరుత (వీడియో)

78చూసినవారు
తమిళనాడులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. నీలగిరిలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలోకి చిరుత చొరబడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నీలగిరి జిల్లాలోని ఊటీ, కున్నూరు, కోతగిరి తదితర పర్యాటక ప్రాంతాల్లో కొంతకాలంగా చిరుతల సంచారం అధికంగా ఉంది. కాగా, సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్