రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్

83చూసినవారు
రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA) సస్పెన్షన్ విధించింది. మార్చిలో పారిస్ ఒలింపిక్స్ ఎంపిక ట్రయల్స్ తర్వాత డోప్ పరీక్ష కోసం మూత్ర నమూనాను ఇవ్వడానికి బజరంగ్ నిరాకరించాడు. దీంతో ఆయనపై NADA నిషేధం విధించింది. తాజాగా మరోసారి సస్పెన్షన్ విధిస్తూ NADA ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. బజరంగ్ ఏ తప్పూ చేయలేదని, తాము పోరాడతమని ఆయన లాయర్ సింగానియా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్