రాజ్యాంగంపై దాడిని జ‌ర‌గ‌నివ్వం: రాహుల్ గాంధీ

81చూసినవారు
రాజ్యాంగంపై దాడిని జ‌ర‌గ‌నివ్వం: రాహుల్ గాంధీ
దేశ రాజ్యాంగంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా దాడికి పాల్ప‌డుతున్న‌ట్లు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. జ‌వాబు ఇవ్వ‌కుండా ప్ర‌ధాని మోదీని ప్ర‌తిప‌క్షాలు త‌ప్పించుకోనివ్వ‌వని ఆయ‌న అన్నారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఇవాళ రాహుల్ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం పై దాడిని ఆమోదించ‌బోమ‌న్నారు. రాజ్యాంగం పుస్త‌క కాపీల‌ను చేతుల్లో ప‌ట్టుకున్న ఇండియా కూట‌మి నేత‌లు ఇవాళ లోక్‌స‌భ‌కు మార్చ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్