దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన పశ్చిమబెంగాల్ RG కర్ ఆసుపత్రి జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ముద్దాయి సంజయ్‌రాయ్‌కి సియాల్దా కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించడం సరికాదని బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ కోల్‌కతా హైకోర్టుకు అప్పీలు చేశాయి. అతడికి మరణ శిక్ష విధించాలని కోరాయి. కాగా, అప్పీలుదారుల వాదనలను విన్న హైకోర్టు తన నిర్ణయాన్ని తరువాత ప్రకటిస్తానని తెలిపింది.