శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. దీంతో ఆదివారం ఆరు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం స్పిల్ వే ద్వారా 1.67 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1.64 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.4 అడుగులుగా ఉంది.