బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆదివారం గచ్చిబౌలి, షేక్‌పేట, బోడుప్పల్, ఉప్పల్, కూకట్పల్లి, మాధాపూర్, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ఇక మరో రెండు రోజులు ఇతర ప్రాంతాల్లో సైతం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.