ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం వారి కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ఆధ్వర్యంలో దండెపల్లి మండలంలోని తానిమడుగు గ్రామ పరిధిలో జీవన ఎరువుల పంపిణీ మరియు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ నాయక్ మాట్లాడుతూ.. జీవన ఎరువుల ప్రాముఖ్యత మరియు వాటిని వాడడం వల్ల ఉపయోగాలు వివరించారు. ఈ జీవన ఎరువుల్లోని బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని మొక్కలకు అందేలా మరియు అదేవిధంగా భూమిలోని భాస్వరాన్ని మొక్కలు స్వీకరించేలా చేస్తాయి. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్ మాట్లాడుతూ.. జీవన ఎరువులు ఉపయోగాలు వివరిస్తూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డాక్టర్ రాజేశ్వర్ నాయక్, డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ తిరుపతి మరియు మండల వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి సాయి కృష్ణ, గ్రామ సర్పంచ్ ప్రేమ, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కిషోర్, మాజీ జడ్పీటీసీ యశ్వంత్ మరియు తానిమడుగు గ్రామ రైతులందరూ పాల్గొన్నారు.