రైతుల ఖాతాల్లోకే రుణమాఫీ డబ్బులు?

21522చూసినవారు
రైతుల ఖాతాల్లోకే రుణమాఫీ డబ్బులు?
తెలంగాణలో కూడా మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ సర్కారు రూ.2 లక్షల లోపు ఉన్న పంటరుణాలను షరతులేవీ విధించకుండా మాఫీ చేసింది. ఒకేసారి రూ.20 వేల కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఆ సొమ్మును లోన్ పేమెంట్ కింద బ్యాంకులు జమ చేసుకున్నాయి. తెలంగాణ వ్యవసాయ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు మహారాష్ట్రలో ఈ విధానాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్