రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ సవరణ ద్వారా రైల్వేలను ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రతిపక్షాలు తప్పుడు కథనాలు తెరపైకి తెచ్చాయని అన్నారు. రైల్వే బిల్లుతో అలాంటిదేమీ జరగదన్నారు. రైల్వే బోర్డు పనితీరును మరింత మెరుగుపర్చడంతోపాటు స్వతంత్రతను పెంపొందించేలా రైల్వే సవరణ బిల్లు ఉందన్నారు.