ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. అతడు వాహనాన్ని తోలిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. స్కూటీపై వెళ్లే సమయంలో అతను ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించాడు. హెల్మెట్ కూడా ధరించాడు. మలుపు తిరిగే సమయంలో ఇండికేటర్ వేద్దామనుకుంటే పని చేయలేదు. అయితే రూల్స్ తప్పకూడదు అని అనుకున్నాడో ఏమో గానీ మలుపు రాగానే ఒక కాలు పైకి లేపి ఎడమవైపు చూపించాడు. ఆ తర్వాత స్కూటీని ఎడమవైపు మళ్లించాడు.