నేడు అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

69చూసినవారు
నేడు అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తమిళనాడు పరిసరాల్లో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అలాగే ఏపీలోని విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూ.గో, ప.గో, ఏలూరు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.

సంబంధిత పోస్ట్