నేడు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు

83చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం వాయుగండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఇవాళ విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్