విద్యార్థులకు బహుమతులు అందజేత

60చూసినవారు
విద్యార్థులకు బహుమతులు అందజేత
అచ్చంపేటలో ఇటీవల హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటి విజేతలుగా నిలిచారు. శ్లోకాలు, చిత్రలేఖనం, వ్యాసరచనం వంటి పలు విభాగాలలో ప్రతిభ కనబరిచిన శ్రీ వర్ధన్, విశ్వతేజ, మురళీకృష్ణ, తేజస్విని, హర్షిత, ఆరాధ్య లకు ప్రిన్సిపల్ ఆర్. నవీన్ కుమార్ బుధవారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.

సంబంధిత పోస్ట్