నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి చెందిందన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం. గండీడ్ మండలం రుసుంపల్లికి చెందిన హరి, శ్రీలత దంపతులకు ఇద్దరు పిల్లలు. బుధవారం పిల్లలను తాత వద్ద వదిలి వారు పొలానికి వెళ్లారు. కూతురు గౌతమి(2)ఆడుకుంటూ వెళ్లి పశువులకు నీళ్లు తాగేందుకు నిర్మించిన తొట్టిలో పడింది. పాపను బయటకు తీసి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.