ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు

73చూసినవారు
ఏరువాక పౌర్ణమి వేడుకలను శనివారం దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహించారు. తొలకరి వర్షాలు కురుస్తున్న సమయంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు నిర్వహించడం సంప్రదాయం అందులో భాగంగా శనివారం రైతులు తమ పశువులను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు, శరీరాలకు రంగులు పూసి సర్వాంగ సుందరంగా అలంకరించిన బండ్లకు కట్టి స్థానిక దేవాలయల చుట్టూ తిప్పారు. కొన్ని గ్రామాల్లో తాడు తెంపే కార్యక్రమం సైతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్