మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే జి. మధు సూదన్ రెడ్డి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వాన్ని పెంచుతాయన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.