దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకులలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి విచారం వ్యక్తం చేస్తూ చిత్రపటానికి శుక్రవారం కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడుని దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత, గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అన్నారు.